![]() |
![]() |

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.
గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. తన భర్తతో కలిసి ఫస్ట్ ట్రిప్‌కి వెళ్తున్నట్టుగా చెప్పింది గీతు. "షిప్ లో శ్రీలంక.. పెళ్ళయ్యాక ఫస్ట్ టైమ్ ట్రిప్" అని పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. అందులో తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుందో చెప్పినది. అటు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లతో, ఇటు యూట్యూబ్ లో వ్లాగ్స్ తో, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ లో ఉంటుంది గీతు.
![]() |
![]() |